Indira gandhi biography in telugu wikipedia

ఇందిరా గాంధీ హత్య

ఇందిరా గాంధీ హత్య

ఇందిరాగాంధీ హత్య జరిగిన ప్రదేశంలో స్మారక నిర్మాణం, న్యూఢిల్లీ

ప్రదేశంన్యూఢిల్లీ
తేదీఅక్టోబరు 311984
09:20 (భారత ప్రామాణిక సమయం)
లక్ష్యంఇందిరాగాంధీ
ఆయుధాలుస్టెన్ గన్ , రివాల్వర్
మరణాలు1 (ఇందిరాగాంధీ)
నేరస్తుడుసత్వంత్‌సింగ్ , బియాత్‌సింగ్

భారతదేశానికి మూడవ ప్రధాని ఇందిరాగాంధీఅక్టోబరు 31, 1984 తేదీన న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు హత్య గావించబడింది.[1][2] ఆమెను స్వంత అంగరక్షకులైన సత్వంత్‌సింగ్, బియాత్‌సింగ్ లే హత్య చేశారు.[3] ఈ హత్య అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్కు ప్రతీకారంగా జరిగింది.[4]

హత్య

[మార్చు]

1984అక్టోబరు 31 న సుమారు 9:20 కు ఐరిష్ టెలివిజన్ కొరకు డాక్యుమెంటరీ నిర్మాణం కోసం బ్రిటిష్ నటుడు "పీటర్ ఉస్తినోవ్"కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళవలసి ఉంది.

ఆ సందర్భంలో ఆమె తన యింటి ఉద్యానవనంలో నడుచుకుంటూ యింటి సమీపంలో గల అక్బర్ రోడ్డు అఫీసుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.[1]

ఆమె తన వికెట్ గేట్ వద్దకు వచ్చేసరికి అక్కడ కాపలాగా ఉన్న సత్వంత్‌సింగ్, బియాంత్ సింగ్ లు కాల్పులు జరిపారు. సబ్‌ఇన్‌స్పెక్టరు అయిన బియాంత్ సింగ్ ఆమె పొట్టలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.[5] వెంటనే సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్ తో ఆమె నేలకూలే వరకు 30 రౌండ్ల కాల్పులు జరిపాడు.[5] కాల్పుల అనంతరం ఇద్దరూ వారి ఆయుధాలను నేలపైకి విసిరి వేసారు.

బియాంత్ సింగ్ "నేను ఏది చేయాలనుకున్నానో అది చేసాను. నీవు ఏమి చేయాలనుకున్నావో అది చేసావు" అని అన్నాడు. తరువాతి ఆరు నిమిషాలలో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసుకు సంబంధించిన సైనికులైన తార్సెమ్‌సింగ్ జమ్వాల్, రామ్‌శరణ్ లు వారిని పట్టుకొని బియాంత్‌సింగ్ ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు. బియాంత్ సింగ్ ఆ గదిలో ఉన్న అధికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించినందున అతనిని కాల్చి చంపారు.

సత్వంత్ సింగ్ ను ఇందిరాగాంధీ మరో అంగరక్షకుడు అరెస్టు చేశాడు.[6] సత్వంత్ సింగ్ తన తోడు దొంగ అయిన కేహార్ సింగ్ తో సహా 1989లో ఉరి తీయబడ్డాడు.[7] ఈ హత్య గురించి సంఘటన జరిగిన 10 గంటల తరువాత అక్టోబరు 31, 1984 న సాయంత్రం దూరదర్శన్ వార్తలలో మొదటి సారి సల్మా సుల్తాన్ మొదటి వార్తను వెలువరించారు.[8][9] తన భద్రతా సిబ్బందే ఇందిరా గాంధీని హత్య చేయవచ్చునని ఇంటెలిజన్స్ అధికారులు సూచించినా ఆమె వ్యక్తిగత కార్యదర్శి అయిన ఆర్.

కె. థావన్ అందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఎదుర్కొన్నాడురు.[10]

హంతకులు

[మార్చు]

మొతటి హంతకుడు బియాంత్ సింగ్ ఇందిరా గాంధీ భద్రతా సిబ్బందిలో ఆమెకు అభిమానమైనవాడు. ఆయన ఆమెకు 10 సంవత్సరాలుగా సుపరిచితుడు.[5] రెండవ హంతకుడు సత్వంత్ సింగ్ హత్య జరిగేనాటికి 22 యేండ్లు వయస్సువాడు.

ఆయన హత్యజరిగిన నాటికి 5 నెలల ముందుగ అంగరక్షకునిగ చేరాడు.[5]

మరణం

[మార్చు]

ఆమె కాల్పుల అనంతరం 09:30 కు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, న్యూఢిల్లీ) కు తరలించారు. అచ్చట వైద్యులు శస్త్రచికిత్స చేసారు. ఆమె మరణించినట్లు 14:20 కు ధ్రువీకరించారు. డా.టి.డి.డోగ్రా నేతృత్వంలోని వైద్యబృందం ఆమెకు పోస్టుమార్టం నిర్వహించారు.

ఆయన నివేదిక ప్రకారం 30 బుల్లెట్లు స్టెన్ గన్, రివాల్వర్ నుండి వెలువడినవి ఆమె శరీరం ద్వారా దూసుకుపోయినట్లు వెల్లడించారు. హంతకులు 33 బుల్లెట్లను ఆమెపై ప్రయోగించారు. వాటిలో 30 ఆమె శరీరంలోనికి ప్రవేశించాయి. వాటిలో 23 ఆమె శరీరం గుండా పోయినవి. ఏడు శరీరంలో ఉండిపోయినవి. డా. డోగ్రా ఏ ఆయుధం నుండి ఏ బుల్లెట్ వెలువడినదో బాలిస్టిక్ పరీక్ష ద్వారా విశదపరిచాడు.

ఈ బుల్లెట్లు సంబంధిత ఆయుధాల నుండి వచ్చినట్లు సి.ఎఫ్.ఎస్.ఎల్. ఢిల్లీ వారు గుర్తించారు. అదే విధంగా డోగ్రా కోర్టులో పి.డబ్ల్యూ 5 గా సాక్షిగా హాజరయ్యాడు. ప్రతివాది తరపున పి.ఎన్ లేఖి అనే న్యాయవాది ఆయనకు క్రాస్ ఎక్జామినేషన్ చేసారు.[11] ఆమె భౌతిక కాయం నవంబరు 1 న తీన్‌మూర్తి భవన్కు తరలించబడింది.[1] ఆమెను నవంబరు 3 న మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్ సమీపంలో "శక్తిస్థల్" వద్ద దహనం చేసారు.

ఆమె భౌతిక కాయానికి ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ దహన సంస్కారాలు చేసారు.

తదనంతర పరిస్థితి

[మార్చు]

ఆమె మరణించిన తరువాత ప్రతీకారంగా జరిగిన అల్లర్లలో నాలుగు రోజులు పాటు సుమారు 8 వేలమంది సిక్కులు హతులైనారు.[12]

మూలాలు

[మార్చు]

  1. 1.01.11.2"25 length of existence after Indira Gandhi's assassination".

    CNN-IBN. 30 October 2009. Archived carry too far the original on 4 నవంబరు 2011. Retrieved 1 మే 2016.

  2. "Assassination in India: A Leader recompense Will and Force; Indira Statesman, Born to Politics, Left Renounce Own Imprint on India". The New York Times. 1 Nov 1984. Retrieved 23 January 2009.
  3. "1984: Assassination and revenge".

    BBC News. 31 October 1984. Archived depart from the original on 15 Feb 2009. Retrieved 23 January 2009.

  4. "1984: Indian prime minister shot dead".

    Kavignar thamarai biography

    BBC News. 31 October 1984. Archived from the original on 17 January 2009. Retrieved 23 Jan 2009.

  5. 5.05.15.25.3Smith, William E. (12 November 1984). "Indira Gandhi's massacre sparks a fearful round party sectarian violence". Time. Retrieved 19 January 2013.
  6. "Questions still surround Solon assassination".

    Times Daily. New City. AP. 24 November 1984. Retrieved 19 January 2013.

  7. ↑Dr. Sangat Kr. Singh, The Sikhs in Version, p. 393
  8. "The riots that could not be televised". Indianexpress.com. 2009-11-03. Retrieved 2015-03-31.
  9. "We the eyeballs : Defend Story - India Today".

    Indiatoday.intoday.in. Retrieved 2015-03-31.

  10. Hazarika, Sanjoy (28 Walk 1989). "India Releases Stinging Tone on Gandhi's Death".

    Asrar shah biography of barack

    The New York Times.

  11. Raina Anupuma, Lalwani Sanjeev (2009). "Dr. Dogra's Professional Evidence in trial of calumny of Late Mrs Indira Solon, Prime Minister of India (Witness No. PW 5)". Indian Information superhighway Journal of Forensic Medicine & Toxicology. Indianjournals.com. Retrieved 2015-03-31.
  12. Nelson, Chaplain (30 జనవరి 2014).

    "Delhi ploy reopen inquiry in to holocaust of Sikhs in 1984 riots". The Telegraph. Retrieved 3 మే 2016.

ఇతర లింకులు

[మార్చు]